బాహుబలి సినిమా తరువాత రాజమౌళి గుర్తింపు దేశవ్యాప్తంగా పాకింది. ఈ నేపథ్యంలో ఆయన తీస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ ఇద్దరు టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించడం మరో విశేషం. కాగా రాజమౌళి కి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ సవాలు విసురుతున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న నేపథ్యంలో వీరి లుక్స్ ఎలా ఉంటాయి అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే రాజమౌళి వీరిద్దరిని ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొని వుంది.
కాగా ఇప్పటికే అనేక మంది ఎన్టీఆర్ మరియు చరణ్ ఫ్యాన్స్ వీరి లుక్స్ ఇవేనంటూ విడుదల చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల పాత ఫోటోలను ఎడిట్ చేసి కొమరం భీం మరియు అల్లూరి సీతారామ రాజులుగా పరిచయం చేస్తున్నారు. వీటిలో కొన్ని పోస్టర్స్ ఒరిగినల్స్ వలె ఉండటంతో పాటు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ ఐతే ఒరిజినల్ అనుకునేంతలా భ్రమింప చేసింది. ఈ నేపథ్యంలో రాజమౌళి కి కొమరం భీమ్, రామరాజు లుక్స్ సవాలుగా మారాయి. ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ లో వారు ఒకరేంజ్ లో ఉండగా రాజమౌళి విడుదల చేసే ఒరిజినల్ లుక్స్ అనేవి అంతకు మించి ఉండాలి. ఏమాంత్రం ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయినా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ బెటర్ అనుకొనే ప్రమాదం ఉంది. కాబట్టి రాజమౌళికి ఎన్టీఆర్, చరణ్ లుక్స్ సవాలుగా మారాయి.