మహేష్ బాబు నటించిన ‘సరిలేర నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఈ విజయాన్ని మహేష్ అండ్ టీమ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణగారు కూడా చిత్రం ఇంతటి విజయాన్ని సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాదు చిత్రానికి దర్శకనిర్మాతలు బ్లాక్ బస్టర్ కా బాప్ అనే పేరు పెట్టడం కూడా నచ్చిందని అన్నారు.
ఇక చిత్రానికి ఇంకా మంచి రన్ ఉంటుందని అనుకుంటున్నానని, నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డబ్బు ఖర్చుపెట్టారని, డైరెక్టర్ కూడా చాలా బాగా సినిమా తీశారని ప్రశంసించారు. తండ్రి మాటలకు స్పందించిన మహేష్ కృతజ్ఞతలు మై సూపర్ స్టార్.. సరిలేరు మీకెవ్వరు అన్నారు.