న్యూ యార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్

న్యూ యార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్

Published on Jan 30, 2020 12:41 PM IST

మహేష్ వెకేషన్ ని న్యూ యార్క్ సిటీలో ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ గతవారం భార్య నమ్రత, కొడుకు గౌతమ్,కూతురు సీతారలతో కలిసి అమెరికా ట్రిప్ కి వెళ్లారు. గతవారం రోజులుగా న్యూ యార్క్ సిటీలో వీరు ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఎప్పుడూ అభిమానులకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండే మహేష్ తన టూర్ అప్డేట్స్, ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం న్యూయార్క్ సిటీలో కుటుంబంతో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. ప్రతి సినిమా విడుదల తరువాత ఓ లాంగ్ ట్రిప్ కి ఫ్యామిలీ తో వెళ్లడం మహేష్ కి అలవాటు. ఇక ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో మహేష్ మరింత ఎంజాయ్ చేస్తున్నారు.

దాదాపు రెండు నెలలు ఈ ట్రిప్ కొనసాగనుంది. ఈ వెకేషన్ ముగిసిన వెంటనే మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రంలో నటిస్తారు. ఇప్పటికే వీరిద్దరూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. మహేష్ గత ఏడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి మూవీ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మహేష్ వంశీ పైడిపల్లి మూవీ ఏడాది చివర్లో లేదా, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం కలదు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు