నవంబర్ 10న చమ్మక్ చల్లో ఆడియో

నవంబర్ 10న చమ్మక్ చల్లో ఆడియో

Published on Nov 8, 2012 7:16 PM IST


నీలకంఠ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “చమ్మక్ చల్లో” అయన చేసిన చిత్రాలలో మొదటి ప్రేమకథా చిత్రం అవ్వనుంది. ఇప్పటి వరకు అయన “షో”,”మిస్టర్ మేధావి”, “సదా మీ సేవలో” , “మిస్సమ్మ” వంటి ప్రయోగాత్మక చిత్రాలనే చేశారు. ప్రస్తుతం అయన చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి “లవ్ లో లాజిక్ లేదు” అన్నది టాగ్ లైన్. వరుణ్ సందేశ్, సంచితా పదుకొనే మరియు కేథరిన్ తెరిసా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల మరియు చిన్మయి ఘట్రాజు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ సందేశ్ తండ్రి పాత్రలో బ్రహ్మానందం కనిపించనున్నారు. ఈ చిత్రం నవంబర్ 10న రవి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఆడియో విడుదల జరుపుకోనుంది. కిరణ్ వారణాసి సంగీతం అందించిన ఈ చిత్రానికి రంగనాథ్ గోగినేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు