దీపావళి అలా చేసుకోవద్దు అంటున్న త్రిష

దీపావళి అలా చేసుకోవద్దు అంటున్న త్రిష

Published on Nov 8, 2012 6:16 PM IST

చెన్నై ముద్దుగుమ్మ త్రిష జంతు హక్కుల సంరక్షణ గురించి పలు జాగ్రత్తలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా త్రిషకి కుక్కలు అంటే చాలా ఇష్టం. త్వరలోనే ధూమ్ ధామ్ గా చేసుకునే దీపావళి పండుగ రానుంది. ఈ సందర్భంగా త్రిష ఈ పండుగ సమయంలో చేసే శబ్దాలు జంతువులకు హాని కలిగిస్తాయని అంటోంది. ‘కుక్కలను భయపెట్టే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే టపాకాయలను కాల్చకండి అని’ త్రిష ట్వీట్ చేసారు, ట్వీట్ తో పాటు పైన మీరున్న ఫోటోని కూడా పోస్ట్ చేసారు. మరి ఫ్రెండ్స్ త్రిష చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది కనుక మీరు కూడా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే టపాకాయలను తగ్గించి రాత్రి వెలుగుజిలుగుల్లో ఈ దీపావళి జరుపుకోండి. ఇలా చేయడం ఒక్క కుక్కలకు మాత్రమే కాదండోయ్, మనకు కూడా ఎంతో శ్రేయస్కరం. త్రిష గారు చాలా మంచి పని చేస్తున్నారు, ఈ విషయంలో మీతో పాటు మేము కూడా ఉన్నాము.

తాజా వార్తలు