సినిమా అనేది కేవలం వినోదం పంచడానికే.!

సినిమా అనేది కేవలం వినోదం పంచడానికే.!

Published on Nov 8, 2012 2:51 AM IST

ఇటీవల విడుదలైన కెమెరామెన్ గంగతో రాంబాబు, దేనికైనా రెడీ సినిమాలు రెండు వేరు వేరు వివాదాల నేపధ్యంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదాలకు ముగింపు చెప్పాలనే ఉద్దేశంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఈ రోజు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు. మొదటగా పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ‘సినిమా ముఖ్య ఉద్దేశం వినోదం. వీలైతే విజ్ఞానం, వికాసం అందించడం. సినిమా అనేది ఒక వర్గం, కులం, మతం మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి రచయిత, నిర్మాత, దర్శకుడు ఆలోచిస్తారు. వారి ఆలోచనలు అధిగమించి ఎవైన పొరపాట్లు జరిగితే వాటిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సెన్సార్ బోర్డు తొలగిస్తుంది. అక్కడ కూడా అభ్యంతరాలు ఉంటే రేవైజింగ్ కమిటీ ఉంది. వారు కూడా నిర్ణయం తీసుకోలేని పరిస్తితి ఉంటె ట్రిబ్యునల్ ఉంది. కానీ ఈ మధ్య దుశ్రద్రుష్టవశాత్తు కొన్ని సినిమాల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కొందరు సినిమాల మీద దాడి చేయడం జరిగింది. సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే నిర్మించడం జరుగుతుంది. ఎవరో కొందరిని టార్గెట్ చేయడం వంటివి ఉండవు. సినిమా మీద వారికీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయపరమైన పోరాటం చేయాలి కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడి చేయడం తగదని అన్నారు.

తాజా వార్తలు