జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన స్టైల్లో వరుసగా సినిమాలు చేస్తూ డాషింగ్ డైరెక్టర్ అనిపించుకున్న హీరో పూరి జగన్నాథ్. పూరి సినిమాలు ఎలా ఉన్నా అన్నింటిలో కామన్ గా ఉండేది మాత్రం మాస్ మరియు ముక్కుసూటిగా కొట్టినట్టు ఉండే డైలాగ్స్ మరియ్టు సెటైరికల్ డైలాగ్స్. ఇలాంటి డైలాగ్స్ రాయడంలో పూరి మంచి దిట్ట. అందరికీ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే వరుసగా సినిమాలు చేస్తున్నా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఇలాంటి డైలాగ్స్ పూరి ఎలా రాస్తున్నాడా? అనేది ఓ పెద్ద డౌట్.
ఇటీవలే 123తెలుగు.కామ్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పూరి ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
‘ నేనెప్పుడూ కొంచెం ఆకలితోనే ఉంటాను. నేనెప్పుడూ బాగా ఫుల్ గా తినేయ్యను, అలాగే ఇదే తినాలి అనే ఆలోచన కూడా ఉండదు. నాకింకా కొంత ఆకలి మిగిలి ఉంది అనే సమయంలోనే నేను నా భోజనాన్ని ముగించేస్తాను. నేను ఎక్కడో చదివాను గొప్ప గొప్ప రచయితలందరూ రిచ్ ఫ్యామిలీల్లో మరియు అన్నీ ఉన్న ఫ్యామిలీల్లో పుట్టలేదు, నేను ఎప్పుడూ వారినే ఫాలో అవుతానని’ అన్నారు. పూరి చెప్పిన ఈ లాజిక్ ఆయన డైలాగ్స్ లో కనిపిస్తుంది.