బాక్సర్ గా కనపడనున్న కాజల్

బాక్సర్ గా కనపడనున్న కాజల్

Published on Nov 7, 2012 4:02 AM IST

“మగధీర” చిత్రం తరువాత కాజల్ కెరీర్ ఊపందుకుంది గత కొద్ది నెలలుగా ఈ భామ నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఎంచుకొని చేస్తున్నారు. ఈ మధ్యనే కెవి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన “బ్రదర్స్ ” చిత్రంలో అనువాదకురాలిగా కనిపించారు. తాజా సమాచారం ప్రకారం ఈ భామ విజయ్ “తుపాకి” చిత్రంలో బాక్సర్ గా కనిపించనుంది. ఈ పాత్ర ప్రముఖ బాక్సర్ మేరి కొమ్ నుండి స్ఫూర్తి పొందినదిగా తెలుస్తుంది ఈ పాత్ర కోసం కాజల్ పలు మేరి కొమ్ వీడియోలను చూసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో విజయ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 13న విడుదల అవుతున్న ఈ చిత్రానికి హారీస్ జయరాజ్ సంగీతం అందించగా సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించారు.

తాజా వార్తలు