రొటీన్ లవ్ స్టొరీ విడుదల తేదీ ఖరారు

రొటీన్ లవ్ స్టొరీ విడుదల తేదీ ఖరారు

Published on Nov 7, 2012 12:17 AM IST

సందీప్ కిషన్, రేజీన హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న రొటీన్ లవ్ స్టొరీ సినిమా ఇటీవలే ఆడియో విడుదల చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ నెల 23న రొటీన్ లవ్ స్టొరీ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాత చాణక్య వెల్లడించారు. డమరుకం విడుదలవుతున్న థియేటర్లలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ప్రదర్శించనున్నట్లు, నైజాం ఏరియాలో దాదాపు 100కి పైగా థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు అయన తెలిపారు. ఈ నెల 8న తిరుపతిలో దర్శనం చేసుకుని చిత్తూరు, అనంతపురం, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు తిరుగుతూ సినిమా ప్రమోషన్ ప్రారంభించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకుడు.

తాజా వార్తలు