నా స్థాయికి తగ్గ సినిమా తీయలేకపోయాను

నా స్థాయికి తగ్గ సినిమా తీయలేకపోయాను

Published on Nov 6, 2012 10:30 PM IST

కెరీర్ మొదట్లో పౌరాణిక మరియు కమర్షియల్ సినిమాలను తీసి సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ గుణశేఖర్ గత కొంత కాలంగా హిట్ లేక వరుసగా ‘సైనికుడు’,’వరుడు’ మరియు ‘నిప్పు’ రూపంలో హట్రిక్ ఫ్లాప్స్ అందుకున్నారు. అర్జున్ సినిమా తర్వాత నుంచి గుణ శేఖర్ కాకతీయులకి గర్వ కారణంగా మారిన ‘రుద్రమ దేవి’ జీవితాన్ని సినిమాని తీయాలనుకుని పలు సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చిన రుద్రమదేవి సినిమా త్వరలోనే కార్య రూపం దాల్చనుంది. ఆ వివరాల కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో గుణశేఖర్ మాట్లాడుతూ ‘ ఇప్పటి వరకూ ఎన్నో హిట్స్ అందుకున్నప్పటికీ దర్శకుడిగా నాకు ఏమాత్రం తృప్తి లేదు నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు నేనింకా నా స్థాయికి తగ్గ సినిమా తీయలేదు. ఈ సినిమా నాకు దర్శకుడిగా సంతృప్తి అందిస్తుందని ఆశిస్తున్నాను. ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం రీసర్చ్ చేసి మరీ కథని తయారు చేశాము. ఈ సినిమా కోసం మొదటి సారిగా మాస్ట్రో ఇళయరాజా గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగానూ మరియు ఉత్సాహంగానూ ఉంది. రుద్రమ దేవి పాత్రను అనుష్క చేయనున్నారని’ అన్నారు. ఈ చిత్రం 2013 ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. స్వయంగా గుణశేఖర్ గారే గుణా టీం వర్క్స్ అనే సంస్థ ద్వారా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు