టాలీవుడ్లో మెరవనున్న పాకిస్తానీ భామ.!

టాలీవుడ్లో మెరవనున్న పాకిస్తానీ భామ.!

Published on Nov 6, 2012 6:50 PM IST

రోజు రోజుకీ గ్లామర్ ప్రపంచంలో వస్తున్న మార్పులు చూస్తుంటే గ్లామర్ కి రాష్ట్రం మరియు దేశం అనే హద్దులు లేనట్టు అనిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు నిజమైతే పాకిస్తానీ అమ్మాయి అయిన వీణా మాలిక్ త్వరలోనే ఒక తెలుగు సినిమాలో నటించనుంది. వివాదాలకు కేంద్ర బిందువైన వీణా మాలిక్ ‘నగ్న సత్యం’ అనే తెలుగు సినిమాలో నటించనుంది. అనురాధా ఫిల్మ్స్ బ్యానర్ పై చదలవాడ శ్రీనివాస రావు నిర్మించనున్న ఈ చిత్రానికి రామారావు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ 10 న మొదలు కానుంది మరియు ఈ సినిమాని 2013లో విడుదల చేయాలనుకుంటున్నారు.

వీణా మాలిక్ బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని పాకిస్తాన్ వదిలి ముంబైలో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ ఒక కన్నడ సినిమాలో నటిస్తోంది. తనకి నటన పరంగా ఎంత అవగాహన ఉందో పక్కన పెడితే తను సినిమాలో ఉంది అనగానే చూడటానికి మాత్రం ఆమె ఇంటర్నేషనల్ ఫాన్స్ ఆసక్తి చూపుతారు. వీణా మాలిక్ ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా తన అంగీకారాన్ని తెలిపారు కావున పెద్ద స్టార్స్ పక్కన ఐటెం పాటల్లో చిందేసే అవకాశం కూడా ఉంది.

తాజా వార్తలు