ఎన్నో రోజులుగా ఊరిస్తున్న ‘రుద్రమ దేవి’ సినిమా పై వస్తున్న ఊహగానాలకి గుణ శేఖర్ తెరదించాడు. ఆయన రాణి రుద్రమ దేవి మీద సినిమా తీయబోతున్నట్లు గత సంవత్సర కాలం నుండి ఊహగానాలు నడుస్తున్నాయి. తాను రుద్రమ దేవి అనే సినిమా తీయబోతున్నట్లు గుణ శేఖర్ ఈ రోజు ప్రకటించారు. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుణ శేఖర్ మాట్లాడుతూ “గత పదేళ్లుగా ఈ సినిమా చేలని అనుకుంటూ వస్తున్నాను. ఒక్కడు సినిమా తరువాత ఈ సినిమానే చేద్దామనుకున్నాను. కానీ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో స్టార్ హీరోలు లేకుండా ఇంత భారీ సినిమా చేయడానికి ధైర్యం సరిపోలేదు. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు తీసిన ‘అరుంధతి, రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమాలు ఎలాంటి స్టార్ హీరోలు లేకుండా స్టార్ హీరోల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా హిట్ కావడంతో నాక్కూడా ధైర్యం వచ్చి ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాను. ఇండియాలో వస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి సినిమా ఇది. అనుష్క ప్రధాన పోషిస్తుంది. ఈ సినిమాతో నేను నిర్మాతగా కూడా మారుతున్నాను. గుణా టీం వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాను. ఇళయరాజా గారు సంగీతం అందించబోతున్నారు. వచ్చే ఏడాది 2013 ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభమవుతుంది”.
3డి లో రాబోతున్న ‘రుద్రమ దేవి’
3డి లో రాబోతున్న ‘రుద్రమ దేవి’
Published on Nov 6, 2012 2:48 PM IST
సంబంధిత సమాచారం
- ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలను సందర్శించిన బాలకృష్ణ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- కాంతార చాప్టర్ 1 : తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారంటే..?
- అఫీషియల్ : దుల్కర్‌తో జతకట్టిన బుట్టబొమ్మ..!
- క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!