హాట్ లుక్స్ తో మతిపోగొడుతున్న తమన్నా.!

హాట్ లుక్స్ తో మతిపోగొడుతున్న తమన్నా.!

Published on Aug 31, 2012 2:05 PM IST


సినిమా సినిమాకి మన మిల్క్ బ్యూటీ తమన్నా అందం రెట్టింపవుతోంది. ఇటీవలే విడుదలైన ‘రచ్చ’ సినిమాలో తన అందాలతో పిచ్చెక్కించిన తమన్నా తన రాబోయే చిత్రంలో అంతకన్నా ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని పై ఫోటో చూస్తే అర్ధమవుతుంది. ఈ రోజు విడుదల చేసిన ‘రెబల్’ సినిమాలోని తమన్నా ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది మరియు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో చూసిన అందరూ ఒక్క ఫోటోలోనే ఇలా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందా అనే ఆలోచనలో పడ్డారు. తన సినిమాల్లో హీరోయిన్లని చాలా గ్లామరస్ గా చూపించే రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో కూడా తమన్నాని కూడా సూపర్బ్ గా చూపించారనడానికి ఇదొక సాంపిల్ అనుకోవచ్చు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దీక్షా సేథ్ మరో కథానాయికగా నటించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించిన ఈ చిత్రాన్ని జె.భగవాన్ మరియు జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ 14న విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు