దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు మరియు సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారి వారి విభాగాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారు. అందులో ముఖ్యంగా రాఘవేంద్ర రావు ఒక విషయంలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అదేమిటనగా ఆయన స్టేజ్ పైన మాట్లాడారు. ఆయన చేత చాలా మంది మాట్లాడించాలని ప్రయత్నం చేసారు కానీ ఎవరు మాట్లాడించలేకపోయారు కానీ ఎం.ఎం కీరవాణి మాత్రం దీన్ని బ్రేక్ చేసి, ఇటీవలే హైదరాబాద్లో జరిగిన ‘శిరిడి సాయి’ ఆడియో విజయోత్సవ వేడుక ‘అంతా సాయి మయం’ లో రాఘవేంద్ర రావు చేత మాట్లాడించారు.
ఈ వేడుకలో ‘శిరిడి సాయి’ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ మొమెంటోలను అందజేశారు. ఈ కార్య క్రమంలో కీరవాణి మాట్లాడుతూ ‘ నేను అడిగే ప్రశ్నలు రాఘవేంద్ర రావు గారు సమాధానం ఇవ్వాలి లేకుంటే ‘రాఘవేంద్ర రావు కాంప్లెక్స్ ‘ నాకు రాసిచ్చేయాలి అన్నారు. కీరవాణి మొదటగా ‘గాలి కన్నా వేగవంతమైనది ఏది?’ అని అడగగా దానికి రాఘవేంద్ర రావు గారు సమాధానమిస్తూ ‘మనసు’ అన్నారు. కీరవాణి గారు వెంటనే రెండు అరులు కలిపితే ఎంత? రాఘవేంద్ర రావు గారు సమాధానమిస్తూ ’66 , రెండు పక్క పక్కన కలిపితే అది వస్తుందన్నారు’. మళ్ళీ కీరవాణి గారు ‘మీకు బాగా నచ్చినది ఏంటి?’ దానికి రాఘవేంద్ర రావు గారు సమాధానమిస్తూ ‘నాకు మీ సంగీతం అంటే ఇష్టం’ అని అన్నారు.
ఇలా ఒకరు వేసే ప్రశ్నలకు మరొకరు సమాధానాలు ఇచ్చుకుంటూ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు మరియు ‘మౌన ముని’ రాఘవేంద్ర రావు గారి చేత మాట్లాడినందుకు వేడుకకి వచ్చిన వారు ఎంతో సంతోషించారు.