ఇప్పటి వరకూ మన తెలుగు ఇండస్ట్రీలో తమిళ్, కేరళ, ముంబై మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కథానాయికలే ఎక్కువమంది ఉన్నారు. అదే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇతర భాషల్లో నంటించిన తెలుగు కథానాయికలు చాలా తక్కువ. ఆ తక్కువ మంది జాబితాలో మన తెలుగు ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి కూడా చేరింది. ఇప్పటివరకు తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్న ఈ భామ ఇప్పుడు మళయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టనుంది. మలయాళంలో తెరకెక్కనున్న ‘ఆమెన్’ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి కలర్స్ స్వాతి అంగీకరించారు. లిజో జోస్ పెల్లిస్సేరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. .
ఒక చర్చి పక్కన నివాసం ఉండే ప్రజల చుట్టూ తిరిగే ఈ కథలో స్వాతి సింగర్ పాత్రని పోషించనుంది. 2005 లో ‘డేంజర్’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన స్వాతి, ఆ తర్వాత తమిళంలో నాలుగు సినిమాలు చేసారు అందులో ‘సుబ్రమణ్యపురం’ మరియు ‘పోరాలి’ చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. చాలా గ్యాప్ తర్వాత స్వాతి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తునారు, అందులో ఒకటి నిఖిల్ సరసన చేస్తున్న ‘స్వామీ రా రా’ చిత్రం, మరొకటి నవదీప్ హీరోగా నటిస్తున్న ‘బంగారు కోడి పెట్ట’. తెలుగు మరియు తమిళ బాషలలో విజయాలు చవి చూసిన కలర్స్ స్వాతి మలయాళంలో కూడా అదే హవా కొనసాగించాలని కోరుకుందాం.
మలయాళంలో అరంగేట్రం చేయనున్న ‘కలర్స్’ స్వాతి
మలయాళంలో అరంగేట్రం చేయనున్న ‘కలర్స్’ స్వాతి
Published on Aug 30, 2012 1:28 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!