ఈ రోజు టాలీవుడ్ మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. 1959 ఆగష్టు 29 న చెన్నైలో జన్మించాడు. మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎమ్.ఎస్ చేసి 1986లో ‘విక్రమ్’ సినిమాతో ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసాడు. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు. గీతాంజలి సినిమాతో మొదలైన ఆయన ప్రయోగాల పర్వం నేటికి కొనసాగుతుంది. శివ సినిమాతో తెలుగు సినిమా స్థితి గతులనే మార్చారు ఆయన. అయన ఇప్పటికీ కొత్త దర్శకులని, కొత్త కాన్సెప్ట్ లని బాగా ఎంకరేజ్ చేస్తారు. యాక్షన్, లవ్ స్టొరీ సినిమాలే కాదు భక్తిరసమైన సినిమాలు చేసి కూడా మెప్పించగలనని నిరూపించారు ఆయన. కె. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన అన్నమయ్య ఆయన కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. శ్రీ రామదాసు పాత్రలో కూడా అటు విమర్శకుల ప్రశంసల్ని ఇటు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. ఆయన సాయి బాబా పాత్రలో నటించిన శిరిడి సాయి సినిమా సెప్టెంబర్ 6 న విడుదల కాబోతుంది. డమరుకం కూడా త్వరలో విడుదల కానుంది. ఇవే కాకుండా ధశారాద్ డైరెక్షన్లో లవ్ స్టొరీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ 59 ఏళ్ళ నటుడు అందంలో ఇప్పటి యువ హీరోలతో పోటీ పడుతుంటాడు.
123తెలుగు.కాం తరపున అక్కినేని నాగార్జున గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.