నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘శ్రీమన్నారాయణ’. ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి ఆదరణ లబించడంతో ఈ చిత్ర ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుక నిన్న హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ ఈ చిత్రంలో నేను సమాజాన్ని మేల్కొలిపే ఒక టీవీ జర్నలిస్ట్ పాత్ర పోషించాను. మా నాన్న గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసారు. కానీ ఆయన ఆంజనేయుడిగా, నారదుడిగా మరియు జర్నలిస్ట్ పాత్రలను చేయలేదు. ఆ మూడు పాత్రలు నాకు చేసే అవకాసం వచ్చినందుకు చాలా ఆనందంగానూ మరియు గర్వం గాను ఉంది. నా సినిమాల్లో కథానాయికలకు మంచి పాటలు లబిస్తుంటాయని అందారూ అంటుంటారు, అలానే ఈ చిత్రంలో కూడా ఇషా చావ్లా మరియు పార్వతి మెల్టన్ లకు మంచి పాత్రలు లబించాయి. ఒక సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని ఎంతో కసితో చేసిన సినిమా ఇది మరియు దర్శకుడు రవికుమార్ చావాలి చాలా బాగా తీసారు. అభిమానులు మాపై చూపే అబిమానం వెలకట్టలేనిది అందుకోసం నా తుది శ్వాస వరకు వారిని అలరిస్తూనే ఉంటానని’ ఆయన అన్నారు.
ఈ కార్యక్రమమానికి అందాల భామ ఛార్మి, శ్రీ కాంత్, మంచు మనోజ్, ఎస్వీ కృష్ణా రెడ్డి, ఆర్.పి పట్నాయక్, బెల్లంకొండ సురేష్ తదితరులు హాజరయ్యారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించారు. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రం పై అంచానాలు పెరిగిపోయాయి.