పవన్ కళ్యాణ్ సినిమా ఒక వారం ముందే రానుందా?

పవన్ కళ్యాణ్ సినిమా ఒక వారం ముందే రానుందా?

Published on Aug 22, 2012 12:31 AM IST


తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం ఇచ్చిన తేదీ కంటే ఒక వారం ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయాలనుకున్నారు కానీ అనుకున్న దానికంటే ఎంతో వేగంగా ఈ చిత్ర చిత్రీకరణ పూర్తవడంతో అక్టోబర్ 11న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగున్నాయి. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.

పూరి జగన్నాథ్ ఈ చిత్రంతో పవన్ కి సూపర్ హిట్ ఇస్తాడని పవన్ అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవన్ అభిమానులు కోరుకున్నట్టుగానే పవన్ కి సూపర్ హిట్ చిత్రాన్ని ఇస్తాడని ఆశిద్దాం.

తాజా వార్తలు