కలెక్షన్ల పరంగా విదేశాల్లో టాప్ 5 సినిమాలు

కలెక్షన్ల పరంగా విదేశాల్లో టాప్ 5 సినిమాలు

Published on Aug 21, 2012 11:14 AM IST


గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాలు విదేశీ మార్కెట్ ను కొల్లగొడుతూ కలెక్షన్లు అదరగొడుతున్నాయి. ఇప్పటి వరకు టాప్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు విదేశీ మార్కెట్లో టాప్ పొజిషన్లో నిలిచాయి. వీరితో పాటు అగ్ర దర్శకులు రాజమౌళి, శ్రీను వైట్ల, త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కూడా విదేశీ మార్కెట్ ను కొల్లగోడుతున్నాయి.

ఇప్పటి వరకు మాకు అందిన కలెక్షన్ల సమాచారం ప్రకారం శ్రీను వైట్ల డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన ‘దూకుడు’ టాప్ పొజిషన్లో నిలవగా, హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఈగ’, మాటల మాంత్రికుడు డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా ఇటీవలే విడుదలైన జులాయి, మగధీర టాప్ 5 స్థానాలను దక్కించుకున్నాయి.

1. దూకుడు (2011)

2. గబ్బర్ సింగ్ (2012)

3. ఈగ (2012)

4. జులాయి (2012)

5. మగధీర (2009)

తాజా వార్తలు