ఇంకా జోరు తగ్గని ‘జులాయి’ కలెక్షన్స్

ఇంకా జోరు తగ్గని ‘జులాయి’ కలెక్షన్స్

Published on Aug 20, 2012 10:56 PM IST


తన పంచ్ డైలాగులతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొని మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన చిత్రం ‘జులాయి’. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర ఆడియో కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ఇటీవలే ఈ చిత్రం డబుల్ ప్లాటినం డిస్క్ వేడుకల్ని కూడా జరుపుకుంది. ఈ చిత్రం నైజాం మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో అద్భుతమైన కలెక్షన్లు రాబట్టుకుంటోంది. నిన్నటి వరకు నైజాంలో 8 కోట్లా 70 లక్షల షేర్ మరియు తూర్పు గోదావరి జిల్లాలో 1 కోటి 68 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి కావస్తున్నా కలెక్షన్లకు మాత్రం ఎలాంటి డోఖా లేదు. వరుస ఫ్లాపుల తర్వాత ఇంతటి ఘన విజయం అందుకోవడంతో అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలియానా, రాజేంద్ర ప్రసాద్ మరియు సోనూ సూద్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించారు.

ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ – పూరి జగన్నాథ్ కలిసి ‘ఇద్దరు అమ్మాయిలతో’ అనే సినిమా చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘దేశముదురు’ చిత్రం మంచి విజయం సాదించడంతో అప్పుడే ఈ చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు