పూరి జగన్నాథ్ రీ చెక్ చేసుకుంటున్నాడా ?

పూరి జగన్నాథ్ రీ చెక్ చేసుకుంటున్నాడా ?

Published on Aug 19, 2012 11:16 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం ప్రేక్షకుల నుంచి దారుణమైన టాక్ ని అందుకుంది. ఈ ఫలితాన్ని చూసి ఆశ్చర్య పోయిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో అలాంటి తప్పులు జరగకూడదని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తాయి.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కోసం ఇప్పటివరకూ చిత్రీకరించిన కీలక సన్నివేషాలను పూరి జగన్నాథ్ ఒక సారి రీ చెక్ చేసుకుంటున్నాడు. అలాగే కథ మరియు స్క్రీన్ ప్లే విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. గతంలో వచ్చిన హిట్ చిత్రం ‘బద్రి’ చిత్రం తర్వాత మళ్ళీ పూరి – పవన్ కలిసి చేస్తున్న చిత్రం ఇది. మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ ఎలాంటి తప్పులు చేయకుండా ఎంతో జాగ్రత్తగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని తీసి హిట్ కొడతాడని ఆశిద్దాం.

తాజా వార్తలు