ఆ చిత్ర విజయంతో నాకు 20 సంవత్సరాలకు సరిపడా ధైర్యం లభించింది : బండ్ల గణేష్

ఆ చిత్ర విజయంతో నాకు 20 సంవత్సరాలకు సరిపడా ధైర్యం లభించింది : బండ్ల గణేష్

Published on Aug 18, 2012 1:11 PM IST


‘గబ్బర్ సింగ్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ఆంధ్ర ప్రదేశ్లో 65 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ చిత్రం నిర్మించడానికి ముందు నేను ఇంత సంతోషంగా లేను. ఈ చిత్రం ఇంతటి విజయం సాదించడం నా అదృష్టం అని నేను భావించాను ఎందుకంటే కష్టపడి సినిమా చేస్తే విజయం తప్పకుండా వరిస్తుంది, ఆ విషయాన్ని మా ‘గబ్బర్ సింగ్’ చిత్రం నిరూపించింది. ఈ చిత్రం విజయం నాకు మరో 20 సంవత్సరాలు నిర్విరామంగా చిత్రాలను నిర్మించే ధైర్యాన్ని మరియు ప్రోత్సాహాన్ని అందించిందని’ ఆయన అన్నారు. అలాగే పవన్ కళ్యాన్ గురించి మాట్లాడుతూ ‘ పవన్ కళ్యాన్ గారితో వరుసగా రెండు సినిమాలు చేసాను. రెండు సినిమాల్లో ఆయన అద్భుతంగా నటించారు. ఈ రోజు నేను నిర్మాతగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం పవన్ గారే అని చెప్పుకోవడంలో నాకు ఎలాంటి మొహమాటము లేదు. హరీష్ శంకర్ మరియు దేవీ శ్రీ ప్రసాద్ లు కూడా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారని’ ఆయన అన్నారు.

ప్రస్తుతం మరియు రాబోయే సంవత్సరాల్లో బండ్ల గణేష్ పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ కానున్నారు, అలాగే టాలీవుడ్లోని పెద్ద హీరోలందరితో సినిమాలు చేయాలని గణేష్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఎల్లాప్పుడూ విజయం అనేది బండ్ల గణేష్ గారి వెంటే ఉండాలని మరియు ఆయన ఇంకా మరెన్నో మంచి చిత్రాలను మనకు అందించాలని కోరుకుందాం.

తాజా వార్తలు