‘శ్రీమన్నారాయణ’ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విశేషాలను తెలియజేశారు. ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్లో రమేష్ పుప్పాల మాట్లాడుతూ ‘ నా సినిమా కోసం నేను బాలకృష్ణ గారిని కలవడానికి ముందు నన్ను చాలామంది భయపెట్టారు, వారి మాటలు విని నేను ఆయనతో సినిమా చేయకపోయి ఉంటే ఉన్నతమైన వ్యక్తిగత భావాలు కలిగిన ఒక మనిషితో అనుబందాన్ని కోల్పోయే వాన్ని. బాలకృష్ణ గారు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. సెట్లో ఉండే అందరితో ఎంతో స్నేహంగా ఉంటూ, అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగిన మనిషి. అలాగే చిత్రీకరణ మొదలైతే పూర్తిగా తన పాత్రలో లీనమైపోతారు. బాలకృష్ణ గారి టాలెంట్ మరియు ప్రోత్సాహమే ఈ చిత్రం ఇంత తొందరగా పూర్తవడానికి గల కారణం. ఎవరేమన్నా బాలయ్య మాత్రం చాలా గొప్ప మనిషి అని’ ఆయన అన్నారు.
పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి రవి కుమార్ చావాలి దర్శకత్వం వహించారు. సమాజానికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో నిజాయితీగా ఉండే ఒక జర్నలిస్ట్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు అనేదే ఈ చిత్ర కథాంశం.