ఆమెది సూపర్బ్ ఫిజిక్ : విక్రమ్

ఆమెది సూపర్బ్ ఫిజిక్ : విక్రమ్

Published on Aug 17, 2012 3:45 AM IST


ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘శివ తాండవం’ చిత్ర చిత్రీకరణ సమయంలో విక్రమ్ మరియు అమీ జాక్సన్ చాలా బాగా కలిసి ఉండేవారు. శంకర్ – విక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘ఐ’ చిత్రంలో అమీ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించనుందనే వార్తలు రాగానే, విక్రమ్ పర్సనల్ గా సిఫార్సు చేసాడనే పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లను ఇద్దరూ ఖండించారు మరియు ఈ చిత్రంలో శంకర్ గారే స్వయంగా అమీని తీసుకున్నారని విక్రమ్ అన్నారు. ఈ మధ్యనే ఓ ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ ని ఈ సినిమాలో మీకు మరియు అమీ జాక్సన్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు విక్రమ్ సమాధానమిస్తూ ‘ తను చాలా కొత్తగా ఉంటుంది, మన ఇండస్ట్రీలో చాలా మంది అందాల భామలు ఉన్నారు కానీ అమీ జాక్సన్ కి అందంతో పాటు సూపర్బ్ ఫిజిక్ ఉంటుంది, అందువల్ల తను ఎంత గ్లామరస్ గా కనిపించినా అసభ్యకరంగా అనిపించదు. ఈ రెండు చిత్రాల్లోని పాత్రలకి తను బాగా సరిపోయిందని’ ఆయన అన్నారు.

ప్రస్తుతం తమిళం నేర్చుకుంటున్న ఈ భామ మీద కోలీవుడ్లో పలువురు ఆసక్తి చూపుతున్నారు. అమీ జాక్సన్ ప్రస్తుతం ఈ రెండు తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగులో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ చిత్రంలో నటిస్తోంది. స్వతహాగా యు.కె కి చెందిన ఈ భామ తన నటనతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అందువల్లే ఈ భామ టాప్ దర్శకులైన శంకర్, గౌతమ్ మీనన్ (‘ఏక్ దీవానా తా’ అనే హిందీ చిత్రం) మరియు ఎ.ఎల్ విజయ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

తాజా వార్తలు