ఆగష్టు 24న రానున్న ‘నిరంతరం నీ ఊహలే’

ఆగష్టు 24న రానున్న ‘నిరంతరం నీ ఊహలే’

Published on Aug 15, 2012 1:06 AM IST


అధర్వ మరియు అమలా పాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నిరంతరం నీ ఊహలే’ చిత్రం ఆగష్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎల్రెడ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈయన గతంలో ‘రంగం’ సినిమాని నిర్మించారు. థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా సాగే ఈ చిత్రాన్ని ఎక్కువభాగం యు ఎస్ లోని(లాస్ వెగాస్ లాంటి) అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ సంగీతం అందించారు. ఈ సంవత్సరం మొదట్లో తమిళంలో విడుదలై మంచి విజయం సాదించిన ‘ముప్పోజ్జుదాం ఉన్ కర్పనైగల్’ చిత్రానికి అనువాదమే ఈ చిత్రం. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు తెలుగులో డబ్ చేస్తున్నారు. ఇది కాకుండా, సముధ్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ జెండా పై కపిరాజు’ మరియు వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాయక్’ చిత్రాల్లో అమలా పాల్ నటిస్తోంది.

తాజా వార్తలు