అర్బన్ ఏరియాల్లో కాసుల వర్షం కురిపిస్తున్న జులాయి

అర్బన్ ఏరియాల్లో కాసుల వర్షం కురిపిస్తున్న జులాయి

Published on Aug 14, 2012 8:47 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన స్టైలిష్ ఎంటర్టైనర్ మూవీ ‘ జులాయి’. ఈ చిత్రం విడుదలైన అన్ని ఎరియాల్లోనూ మంచి కలెక్షన్లు రాబట్టుకుంటోంది. ముఖ్యంగా అర్భన్ ఏరియాల్లో భారీగా కలెక్షన్లు వస్తున్నాయి, దీనికి కారణం బాగా కామెడీతో కూడుకున్న త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ అనే చెప్పుకోవాలి. మామూలుగా త్రివిక్రమ్ గారి సినిమాలు అర్బన్ ఏరియా వారిని బాగా ఆకట్టుకుంటాయని పేరుంది, మళ్ళీ అదే మాజిక్ చేసి అర్బన్ ప్రేక్షకులను అమిటగా ఆకట్టుకున్నారు.

డి.వి.వి దానయ్య సమర్పణలో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ‘జులాయి’ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇకముందు కూడా బాక్స్ ఆఫీసు దగ్గర ఎలాంటి కలెక్షన్ల రికార్డు సృష్టించనుందనే దాని కోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు