‘‘
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన రాబోయే ‘బాద్షా’ చిత్రం కోసం త్వరలో బ్యాంకాక్ వెళ్లనున్నారు. బ్యాంకాక్ లో ఈ చిత్రానికి సంభందించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎన్.టి.ఆర్ మరియు ‘బాద్షా’ చిత్ర యూనిట్ నాలుగు వారాల లాంగ్ యూరప్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇటీవలే ఇండియాకి తిరిగివచ్చారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరికొత్త లుక్ తో కనిపించనున్నారు. ‘బాద్షా’ చిత్రాన్ని 2013 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.