మాస్ మహా రాజ రవితేజ మరియు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇద్దరూ త్వరలోనే ఒకరితో ఒకరు తలపడనున్నారు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం ఎంటా అని అనుకుంటున్నారా? ఈ ఇద్దరూ ఆగష్టు 15న బాక్స్ ఆఫీసు వద్ద తలపడనున్నారు. రవితేజ నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ మరియు సల్మాన్ భాయ్ ‘ ఏక్తా టైగర్ ‘ చిత్రాలు ఈ బుధవారం విడుదల కానున్నాయి. రవితేజ కంటే సల్మాన్ ఖాన్ కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది మరియు రవితేజ కి మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం మంచి క్రేజ్ ఉంది.
భారీగా విడుదలకి సిద్దమవుతున్న ఈ రెండు చిత్రాల్లో సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్’ చిత్రానికి ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. మామూలుగా సల్మాన్ ఖాన్ చిత్రాలు హైదరాబద్లో భారీగా విడుదలవుతుంటాయి, అన్ని చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా హైదరాబాద్లో భారీగా విడుదల కానుంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న రవితేజ మరియు సల్మాన్ ఖాన్ చిత్రాలు మంచి ఫలితాన్ని రాబట్టుకోవాలని కోరుకుందాం. ఈ రెండు చిత్రాలకు సంభందించిన ప్రత్యేకమైన విశేషాలను ఎప్పటి కప్పుడు మీకందిస్తుంటాం, కావున 123తెలుగు.కామ్ ని మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి.