నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘ శ్రీమనారాయణ’ చిత్రం ఆగష్టు చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలియజేశారు. ఇది వరకు ఈ చిత్రం సెప్టెంబర్ మొదటివారంలో రానుందనే వార్తలు వచ్చాయి కానీ ఈ చిత్రం ఆగష్టు చివరి వారంలోనే విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి రవి కుమార్ చావాలి దర్శకత్వం వహించారు.
బాలకృష్ణ సరసన పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించారు.