తమిళంలో పెద్ద చిత్రంలో నటిస్తున్న గాయత్రి

తమిళంలో పెద్ద చిత్రంలో నటిస్తున్న గాయత్రి

Published on Aug 12, 2012 11:02 PM IST


శేఖర్ కమ్ముల “హ్యాపీ డేస్” చిత్రం తో పరిచయం అయిన గాయత్రి పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” చిత్రంతో ప్రాచుర్యం పొందింది. ఆ చిత్రంలో గాయత్రి శ్రుతి హాసన్ స్నేహితురాలి పాత్రలో కనిపించింది. తాజా సమాచారం ప్రకారం ఈ భామకి తమిళం లో చేస్తున్న “మద గజ రాజ” చిత్రంలో పాత్ర గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రంలో విశాల్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ లు ప్రధాన పాత్రలలో నటిస్తుండగా. గాయత్రి, సంతానం సరసన నటిస్తుంది.
ఒకానొక పత్రికతో మాట్లాడుతూ తను ఇప్పటి వరకు పని చేసిన దర్శకుల్లో సుందర్ సి చాలా కూల్ గా ఉంటారని తెలిపారు. “తమిళంలో నా మొదటి చిత్ర రెండవ షెడ్యూల్ మొదలయ్యాక 25వ తారీఖు నుండి చాలా ఉల్లాసంగా గడుపుతున్నా ” అని రెండు రోజుల క్రితం ట్విట్టర్లో చెప్పారు. ఈ చిత్రం ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటుంది.

తాజా వార్తలు