“బాద్షా” చిత్రం కోసం ప్రత్యేకంగా కష్టపడుతున్న తమన్

“బాద్షా” చిత్రం కోసం ప్రత్యేకంగా కష్టపడుతున్న తమన్

Published on Aug 12, 2012 1:13 AM IST


తమన్ ఈ ఏడాది వార్తల్లో ఎక్కువగా కనపడకపోయిన్నా తన రాబోతున్న చిత్రాల కోసం చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం అయన “బాద్షా”, ” నాయక్”, “షాడో”, “బలుపు” చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు. గతంలో “దూకుడు” చిత్రం కోసం శ్రీను వైట్లతో కలిసి పని చేశారు ఇప్పుడు ఎన్టీఆర్ మరియు కాజల్ ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం కోసం తమన్ మరింత కష్టపడుతున్నారు. “బాద్షా బృందం బ్యాంకాక్ పయనమయ్యింది అక్కడ నేను ఒక ప్రత్యేకమయిన పాటను కంపోజ్ చెయ్యనున్నాను” అని ట్విట్టర్లో ప్రకటించారు.చిత్ర బృందం ఇప్పటికే బ్యాంకాక్ పయనమయిపోయింది. ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తుండగా కోన వెంకట్ మరియు గోపి మోహన్ ఈ చిత్రానికి కథ అందించారు. ఈ మధ్యనే ఈ చిత్రం ఇటలీ లో చిత్రీకరణ జరుపుకుంది. 2013 సంక్రాంతి కి ఈ చిత్రం విడుదల అవుతుందని భావిస్తున్నారు.

తాజా వార్తలు