ఆ అనుభవం స్వర్గాన్ని చూసినట్టు ఉంది – తాప్సీ

ఆ అనుభవం స్వర్గాన్ని చూసినట్టు ఉంది – తాప్సీ

Published on Aug 11, 2012 11:52 PM IST


చంద్రశేఖర్ యేలేటి రాబోతున్న అడ్వెంచర్ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణ మొత్తం తాప్సీ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఒక నెల క్రితం చిత్ర బృందం మొత్తం లదాక్ వెళ్లారు చాలా వరకు యాక్షన్ సన్నివేశాలను అక్కడే తెరకెక్కించారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం తాప్సీ మీద బుజ్కషి సన్నివేశాన్ని చిత్రీకరించారు. బుజ్కషి అంటే ఆఫ్ఘానిస్తాన్ లో జరిగే గుర్రపు ఆట ఇందులో ఒక గొర్రె కోసం పలువురు గుర్రం మీద పోటీ పడతారు ఈ సన్నివేశంలో గొర్రె స్థానంలో తాప్సీ ఉంటుంది. రెండు రోజుల క్రితం ఈ నటి తన అనుభవాన్ని ట్విట్టర్లో ఇలా చెప్పింది ” ఈరోజు లదాక్ లోయల్లో చిత్రీకరణలో పాల్గొన్నాను పదిహేను కిలోమీటర్లు నాన్ స్టాప్ గా నీళ్ళతో రైడ్ అదొక అద్భుతమయిన అనుభవం, స్వర్గాన్ని చూసినట్టు ఉంది” అని అన్నారు. ఈ చిత్రం ఇప్పటికి 50% పూర్తయ్యింది. తాప్సీ వెంకటేష్ “షాడో” మరియు తమిళంలో అజిత్ చిత్రంలో పాల్గొనడానికి ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు.

తాజా వార్తలు