నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ‘ఒక్కడినే’ చిత్రాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనివాస్ రాగా ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘ రోహిత్ ఈ చిత్రంలో సూర్య అనే పాత్రను పోషిస్తున్నారు. తను నడిస్తే నెమలి నడకలా, మాట్లాడితే కోయిల గొంతులా మరియు ఒకవేల తనని విదేశాల్లో వదిలినా కూడా అచ్చతెలుగు అమ్మాయిలా ఉండే ఒక అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు సూర్య. తన మిగిలిన జీవితాన్ని ఇక తనతోనే గడపాలని నిర్ణయించుకుంటాడు. సూర్య తన ఫ్యామిలీ ని వదలకుండా, కుటుంబ ప్రేమానురాగాలు మిస్ కాకుండా ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేదే కథాంశం, కానీ ఆ రెండింటి కోసం సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడు అనేది తెరపైనే చూడాలని’ ఆయన అన్నారు.
సి.వి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేరళ కుట్టి నిత్యా మీనన్ నారా రోహిత్ సరసన కథానాయికగా నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.