‘జులాయి’ అనే షిప్ కి త్రివిక్రమ్ గారే కెప్టెన్ : అల్లు అర్జున్

‘జులాయి’ అనే షిప్ కి త్రివిక్రమ్ గారే కెప్టెన్ : అల్లు అర్జున్

Published on Aug 11, 2012 1:00 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్తస్తుతం చాలా ఆనందంగా ఉన్నారు, దీనికి కారణం ఆయన నటించిన ‘జులాయి’ చిత్రానికి మంచి ఆదరణ లబించడమే. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ ఎత్తున విడుదలైంది మరియు ఈ రోజు ఉదయం జరిగిన సక్సెస్ మీట్లో బన్ని ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికరమైన విశేషాలను చెప్పారు. బన్ని మాట్లాడుతూ ‘ ఇప్పటి వరకూ నేను నటించిన అన్ని చిత్రాలకూ మొదటి రోజు మిక్సుడ్ టాక్ లబించేది, కానీ నా కెరీర్లో మొదటిసారి ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్ర విజయానికి సంభందించిన క్రెడిట్ మొత్తం మా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికే చెందుతుంది.అందరూ నేను ఈ చిత్రంలో బాగా చేశానని చెబుతున్నారు అది అంతా ఆయన వల్లే జరిగింది మరియు మా షిప్ కి కెప్టెన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే నేను ఎంత బాగా నటించినా దానికి కారణం మాత్రం ఆయనే’ అని అన్నారు. ఈ చిత్రం మొదటి రోజు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 6.32 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్లు చూస్తుంటే ఈ చిత్రం రెండు వారాల్లో రికార్డు కలెక్షన్లు సాదిస్తుందని అంచనాలు వేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరియు ఇలియానా ప్రధాన పాత్రలు పోషించారు. డి.వి.వి దానయ్య సమర్పణలో ఎన్ రాధాకృష్ణ నర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

తాజా వార్తలు