నా అభిమానుల్ని మదిలో పెట్టుకొనే సినిమాలు ఒప్పుకుంటాను : మహేష్ బాబు

నా అభిమానుల్ని మదిలో పెట్టుకొనే సినిమాలు ఒప్పుకుంటాను : మహేష్ బాబు

Published on Aug 10, 2012 9:17 AM IST


తన అభిమానుల్ని మదిలో పెట్టుకొని ఒక సినిమా ఒప్పుకుంటానని సూపర్ స్టార్ మహేష్ బాబు అంటున్నారు. అందరికంటే ప్రత్యేకంగా ఉండటం వల్లే ఆయనను అభిమానులు చాలా విషయాల్లో అనుసరిస్తున్నారు. అమ్మాయిలకు తన బాయ్ ఫ్రెండ్ ఇలానే ఉండాలి అని కలలు కంటుంటారు, అబ్బాయిలు కూడా అతనిలా ఉండటానికి ఇష్టపడతారు కానీ అతను విషయానికొస్తే అతను మాత్రం నేనొక మధ్య వయస్సు అబ్బాయిని మరియు ఒక మధ్య వయస్సు అమ్మాయికి కలలు నిజం చేసిన హీరో. చాలా మంది సీనియర్ నటులు మహేష్ నటనని మరియు అతను మాట్లాడే స్పష్టమైన భాషను ఇష్టపడతారు. ఇంతకీ మహేష్ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు?

మహేష్ మాట్లాడుతూ ‘ నా ఇమేజ్ ని, నా నుంచి అభిమానులు ఆశస్తున్న విషయాలను మరియు ప్రశంశలు అందుకునే కొత్త రకమైన అంశాలను మనస్సులో పెట్టుకొని కథలువిని ఎంచుకుంటాను. ‘ఖలేజా’ సినిమాలో నా డైలాగ్ డెలివరీ మరియు డైలాగ్ టైమింగ్ లలో మార్చుకున్నాను. ‘దూకుడు’ లో సాధారణమైన నటననే కనబరిచాను. ‘బుజినెస్ మాన్’ లో మళ్ళీ కొత్త రకంగా నటించాను. నటుడనే వాడు ఎప్పటికప్పుడు కొత్త రకంగా కనిపించాలి’.

విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంపై మహేష్ చాలా ఆసక్తిగా ఉన్నారు. ‘ కథలో అంత బలం ఉంటేనే ఒక సినిమాలో ఇద్దరు హీరోలు నటించడానికి అవకాశం ఉంటుందని’ మహేష్ బాబు అన్నారు.

తాజా వార్తలు