యముడికి అల్లుడై పోయిన అల్లరి నరేష్

యముడికి అల్లుడై పోయిన అల్లరి నరేష్

Published on Aug 8, 2012 5:35 PM IST


ఫ్రెండ్లీ మూవీస్ కార్పోరేషన్ బ్యానర్ పై కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిచా పనాయ్ కథానాయికగా నటిస్తున్నారు. అల్లరి నరేష్ ఈ చిత్ర కథ గురించి మాట్లాడుతూ ‘ మానవుడు నరకానికి వెళ్ళడం మరియు అక్కడి నుండి యముడిని భూమి మీదకి తీసుకురావడం అనే దానిపై ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలు వచ్చాయి వాటిని ప్రేక్షకులు బాగా ఆదరించారు. కానీ ఈ చిత్రంలో యముడు ఒక పెళ్లి సంభందం కోసం భూమికి వస్తాడు’ అని ఆయన అన్నారు. ఆ వ్యక్తి అల్లరి నరేష్ అవుతాడు. ఈ చిత్రంలో యమధర్మరాజు కి అల్లుడి పాత్రలో అల్లరి నరేష్ కనిపించానున్నాడని ఫిల్మ్ నగర్ సంమాచారం.

షాయాజీ షిండే యమధర్మరాజు గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మంగళ వారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నరేష్ మాట్లాడుతూ ‘ పూర్తి కామెడీ తో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ఇది. ఈ చిత్రంలో యముడి కుటుంబాన్ని కూడా చూపిస్తున్నాము అని’ ఆయన అన్నారు. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను మరియు పాటలను త్వరలోనే గోదావరిలో చిత్రీకరించనున్నారు. భారీ సెట్స్ మరియు విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉన్న సన్నివేశాలను ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో 6 పాటలు ఉంటాయని ఈ చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత అడ్డాల చంటి అన్నారు. రమ్య కృష్ణ, తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్, కృష్ణ భగవాన్, రఘు బాబు, చలపతి రావు ఎ.వి.ఎస్ మరియు మాస్టర్ భరత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు