స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రం ఈ గురువారం విడుదల కానుంది. అల్లు అర్జున్ ఏ చిత్రానికి లేనంతగా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ చిత్రం యొక్క టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మల్టీ ప్లెక్సుల్లో ఈ చిత్రం యొక్క టికెట్ల కోసం రద్దీ నెలకొంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మార్క్ కామెడీ మరియు అల్లు అర్జున్ మార్క్ డాన్సులు ఈ చిత్రం పై అంచనాలను పెంచేస్తున్నాయి.
గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. సోనూ సూద్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ సూపర్ హిట్ కొడతానని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ హిట్స్ సాదించారు.