అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఐశ్వర్య రాయ్.!

అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఐశ్వర్య రాయ్.!

Published on Aug 7, 2012 4:02 AM IST


అందాల భామ ఐశ్వర్యరాయ్ మళ్ళీ సినిమాల్లో నటించడానికి రంగం సిద్దం చేసుకుంటోంది. ఆమె ఇటీవలే చేసిన ఒక టీవీ ప్రకటన మరియు కళ్యాణ్ జ్యువెలరీ కోసం బహిరంగ ప్రచారం చేసింది. ఈ ప్రకటనలో ఆమెని చూసిన వాళ్ళు ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఐశ్వర్య గర్భంతో ఉన్నప్పుడు అమాంతంగా బరువు పెరిగిపోయిందని ఇక తను ఆ బరువును తగ్గించు కోలెందు అనే విషయం గత కొన్ని నెలలుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో చర్చగా మారింది. జ్యువలరీ బ్రాండ్ కోసం ప్రత్యేకంగా తీసిన ఆమె ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో స్వైరవిహారం చేస్తున్నాయి. మీరు పైన చూస్తున్నా ఫోటో అన్డులోనిదే. ఇది చూస్తుంటే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా ఐశ్వర్య రాయ్ తన రెండవ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనుందని చెప్పొచ్చు . ఇదిలా ఉంటే అమితాబ్ బచ్చన్ మరియు నాగార్జున కలిసి చేసిన కళ్యాణ్ జ్యువెలరీ కొత్త టీవీ ప్రకటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

తాజా వార్తలు