పోరాటాలు చేస్తున్న పవన్ కళ్యాణ్

పోరాటాలు చేస్తున్న పవన్ కళ్యాణ్

Published on Aug 6, 2012 2:45 PM IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కోసం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫాక్టరీలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఇంకా ఇక్కడే రెండు రోజులు చిత్రీకరణ జరుపుకోనుంది. మేము ఇది వరకు చెప్పినట్టుగానే స్పెషల్ నైట్ ఎఫ్ఫెక్ట్స్ తో ఈ ఫైట్స్ ని చిత్రీకరిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రెజీలియన్ బ్యూటీ గాబ్రియేల ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు