అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో రచ్చ పాట

అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో రచ్చ పాట

Published on Mar 6, 2012 3:50 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తూ త్వరలో విడుదల కాబోతున్న ‘రచ్చ’ చిత్రం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోని సెవన్ ఎకర్స్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలోని ‘డిల్లకు డిల్లకు’ అనే పాటను రామ్ చరణ్ మరియు తమన్నా పై చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. మని శర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 11న నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు