విక్రం శేఖర్ , సుప్రియ జంటగా శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సశేషం . క్లాప్ బోర్డ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాతలు శ్రీ కిషోర్, మురళీ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం ఆడియో మధుర ఆడియో ద్వారా ఈ నెల రెండవ వారం లో విడుదల కానుంది . వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బం గా హీరో విక్రం శేఖర్ మాట్లాడుతూ తొలిచిత్రంతోనే నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర రావడం సంతోషం గా ఉందని కచ్చితంగా ఈ చిత్రం నటుడిగా, హీరోగా తనకి మంచి గుర్తింపు తెస్తున్దన్నారు . దర్శకుడు శ్రీ కిషోర్ మాట్లాడుతూ ఆద్యంతం సశేషం చిత్రం ఉద్వేగభరితంగా ఉంటుందని , అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సస్పెంస్స్ థ్రిల్లర్ గా సశేషం చిత్రం రూపొందిందని అన్నారు. నిర్మాత మురళీ కృష్ణ మాట్లాడుతూ రెగ్యులర్ సినిమాలకు బిన్నంగా సశేషం సినిమా ఉంటుందని , ఈ చిత్రం చాల సంతృప్తి కరంగా వచిందని అన్నారు. ఈ చిత్రం లో నటించిన నటీ నటులకు, పనిచేసిన సాంకేతిక నిపుణులకు సశేషం చిత్రం మంచి గుర్తిపు తెస్తుందని అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ శ్రీను , స్టైలింగ్ సూర్య రెడ్డి , మాటలు అనిల్ చోడిసెట్టి, ఎడిటింగ్ సూదన్ మదు, సంగీతం కే.సి.మౌళి, కేమెర సతీష్ , జి.ఎల్.బాబు, పాటలు సదా చంద్ర , కధ, స్క్రీన్ ప్లే బాలాజీ సనాల , ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ సిరాజ్ అహ్మద్ , నిర్మాతలు శ్రీకిశోర్ , మురళీ కృష్ణ , దర్శకత్వం శ్రీ కిషోర్ .
మార్చి రెండవ వారంలో సశేషం ఆడియో విడుదల
మార్చి రెండవ వారంలో సశేషం ఆడియో విడుదల
Published on Mar 6, 2012 10:18 AM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్‌ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్‌తోనే రికార్డులు పటాపంచలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్‌పై మీ అభిప్రాయం..?
- విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. గ్రాఫిక్స్‌తో గూస్బంప్స్ ఖాయం..!
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్‌లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- వీడియో : విశ్వంభర – మెగా బ్లాస్ట్ గ్లింప్స్ (చిరంజీవి, త్రిష)