రాంగోపాల్ వర్మ ‘డిపార్ట్ మెంట్’ ప్రెస్ నోట్

రాంగోపాల్ వర్మ ‘డిపార్ట్ మెంట్’ ప్రెస్ నోట్

Published on Nov 7, 2011 1:31 PM IST

Amitab Bachchan
“Department” పోలీస్ వ్యవస్థకీ, under world organization లకీ మధ్యన ఉండే సంబంధాలని ముఖ్య కథా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది. దీంట్లో అమితాబ్ బచ్చన్ ఒక రాజకీయ నాయకుడిగా మారిన ex – criminal పాత్ర పోషిస్తున్నారు.

సంజయ్ దత్ Under world ని సమూలంగా నాశనం చేయటానికి సృష్టించిన ఒక ప్రత్యేకమైన డిపార్ట్‌మెంట్ కి లీడర్ రోల్ పోషిస్తున్నారు. అభిమన్యు సింగ్ ఒక కౄరమైన క్రిమినల్ రోల్ పోషిస్తున్నాడు.విజయ్ రాజ్ పరారీలో ఉన్న ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నాడు. వీళ్ళు కాకుండా తెలుగు లోంచి రానా దగ్గుబాటి ని, లక్ష్మి మంచు, మధు షాలిని కూడా చాలా ముఖ్యమైన పాత్రల్లో ఉన్నారు.

రానా దగ్గుబాటి ఒక Cop role పోషిస్తున్నారు. లక్ష్మి మంచు, సంజయ్ దత్ భార్య పాత్రని పోషిస్తున్నారు. మధు షాలిని ఒక ఫిమేల్ గ్యాంగ్‌స్టర్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు నవంబర్ లో ముగించుకుని ఫిబ్రవరిలో రిలీజ్ కావటానికి సన్నాహాలు చేసుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు