ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ వార్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. రాజమౌళి షూటింగ్ కి షార్ట్ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. మళ్ళీ తిరిగి జనవరి 2 నుంచి షెడ్యూల్ మొదలవుతుంది, ఆ షెడ్యూల్ కంటిన్యూగా 50 రోజులు జరగనుంది. ఈ వార్ సీక్వెన్స్ లో ప్రభాస్, రానా ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ వార్ సీక్వెన్స్ ని భారీ ఎత్తున షూట్ చేస్తున్నారు, అలాగే నిర్మాతలు కూగా భారీగా ఖర్చు పెట్టడమే కాకుండా, విఎఫ్ఎక్స్ విషయంలో కూడా బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ వార్ సీక్వెన్స్ లో మామూలు ఆర్టిస్టులు కాకుండా 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఇది రాజమౌళి కెరీర్లోనే చాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్న పార్ట్ అని చెప్పాలి.
అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామాని కె. రాఘవేంద్రరావు గారి సమర్పణలో ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.