ప్రభాస్ గాయపడలేదు..!

prabhas-in-bahubali
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా కొంతమంది మీడియా వారు ప్రభాస్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడని చెబుతున్నారు. కానీ ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు, ప్రభాస్ ఎంతో ఆరోగ్యంగా, హ్యాపీగా ఉన్నాడు.

మీము ఈ చిత్ర యూనిట్ తో మాట్లాడాము. వాళ్ళు ప్రభాస్ గాయపడ్డాడు అన్న వార్తల్ని కొట్టి పారేశారు. అలాగే ‘ప్రభాస్ ప్రస్తుతం ఎంతో యాక్టివ్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అసలు ఎక్కడి నుంచి ఈ పుకార్లు వచ్చాయో తెలియడం లేదని’ సీనియర్ ప్రొడక్షన్ మెంబర్ అన్నాడు.

ప్రభాస్ – రానా అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ పీరియడ్ డ్రామాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version