గురువారం నుండి బాహుబలి కేరళ షెడ్యూల్

bahubali-first-look
ఎస. ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. గత కొంత కాలంగా ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఈ గురువారం(నవంబర్ 14) నుండి కేరళలో మొదలుకానుంది.

ఈ చిత్ర బృందం కేరళలో షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్లో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అనుష్క దేవసేన గా కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన రెండు మేకింగ్ వీడియోలను ఇటీవలే విడుదల చేసి ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నారు

2015లో విడుదలకానున్న ఈ సినిమాను ఆర్క మీడియా సంస్థ నిర్మిస్తుంది. ఎం. ఎం కీరవాణి సంగీత దర్శకుడు. సెంథిల్ సినిమాటోగ్రాఫర్

Exit mobile version