స్విస్ బ్యాంక్ కు దారేది అని అడుగుతున్న ఉపేంద్ర

Upendra
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను ప్రేమగా తన అభిమానులు ఉప్పి దాదా గా పిల్చుకుంటారు. అతను నటించిన ఒక సినిమా తెలుగులోకి డబ్ అవ్వడానికి సిద్ధంగావుంది. గతంలో ఉప్పి తీసిన ‘సూపర్’ చిత్రం ఇక్కడ కూడా ఘనవిజయమే సాధించింది.

వెరైటీ టైటిల్లకు పెట్టింది పేరైన ఉపేంద్ర ఈ కొత్త సినిమాకు ‘స్విస్ బ్యాంక్ కు దారేది’ అనే నామకరణం చేశాడు. గతంలో ‘A’, ‘స్టుపిడ్’, ‘H2O’ వంటి విచిత్రమైన టైటిల్స్ తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కన్నడలో ఘన విజయం సాధించిన ‘టోపీవాలా’ కు అనువాద వర్షన్. కామెడీని కలిపిన యాక్షన్ ఎంటెర్టైనర్ గా ఈ సినిమా రూపుదిద్ధుకుంది.ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమాలో భావన హీరోయిన్. వి. హరి కృష్ణ సంగీతాన్ని అందించాడు. ఎం.జి శ్రీనివాస్ దర్శకుడు. రమేష్ బాబు ఆవులూరి డబ్బింగ్ వర్షన్ కు నిర్మాత

Exit mobile version