ప్రభంజనం సృష్టించనున్న రంగం నటుడు

Prabhanjanam-New-Photos-(5)
‘రంగం’ సినిమాలో గుర్తుండిపోయే పాత్రపోషించిన అజ్మల్ ఆ సినిమా ద్వారా తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. అతను ‘రచ్చ’ సినిమాలో ఒక ముఖ్యపాత్రను పోషించాడు

ప్రస్తుతం అజ్మల్ రెండు తెలుగు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒక సినిమా ‘ప్రభంజనం’ వచ్చే యేడాది జనవరిలో విడుదలకానుంది. ఈ సినిమా రెండో షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. నలుగురు విధ్యార్ధుల చుట్టూ ఈ సినిమా నడవనుంది. కామెడీ తో పాటూ సందేశాన్ని కూడా మేళవించిన ఈ సినిమా ఆడియోను డిసెంబర్ లో విడుదలచేయనున్నారు

ఆరుషి ఈ సినిమాలో హీరోయిన్. ఆర్.పి పట్నాయక్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు భాస్కర్ రావు నిర్మాత మరియు దర్శకుడు

Exit mobile version