40 కోట్ల మార్క్ క్రాస్ చేసిన అత్తారింటికి దారేది

attarintiki-daredi
పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద తన కలెక్షన్ల జోరుని ఇప్పుడప్పుడే తగ్గించేలా లేదు. ఈ సినిమా మొదటి వారంలోపే 40 కోట్ల మార్క్(వరల్డ్ వైడ్ షేర్) ని క్రాస్ చేసింది. ట్రేడ్ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఒక్క ఏపిలోనే 6 రోజుల్లో 32 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని చెబుతున్నారు. దీనికి ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుంటే కేవలం ఆరు రోజుల్లోనే 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.

ఈ వారం పెద్ద సినిమా రిలీజ్ లు ఏమీ లేకపోవడంతో అదే ఊపుతో ఈ వారం కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా అల్ టైం అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల జాబితాలో చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ లిస్టులో ఈ సినిమానే నెంబర్ వన్ అవుతుందా? అనేదాని కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

పవన్ కళ్యాణ్ – సమంత జంటగా నటించిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.

Exit mobile version