ప్రముఖ నటినటులతో ‘ చందమామ కథలు’ సినిమా

Chandamama

‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్’, ‘రొటీన్ లవ్ స్టొరీ ‘ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తారు త్వరలో మరో కొత్త సినిమాని తీయబోతున్నాడు. మంచి నటీనటులతో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ‘చందమామ కథలు’. ఈ సినిమాలో సాయికుమార్, నరేష్, లక్ష్మీ మంచు, ఆమని, సౌమ్య బోల్లప్రగడ, చైతన్య కృష్ణ, కృష్ణుడు మొదలగు వారు ప్రదానంగా నటిస్తున్నారు. 8 వేరు వేరు ప్లాట్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మించానున్నారని సమాచారం. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబందించిన మరింత సమాచారాన్ని త్వరలో తెలియజేస్తాం. ప్రవీణ్ సత్తారు తీసిన ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్’ సినిమాకి మంచి రెస్పాన్ వచ్చింది. ఇప్పుడు నిర్మిస్తున్న ఈ సినిమాకూడా మంచి విజయాన్ని సాదించాలని కోరుకుంటున్నాం.

Exit mobile version