స్పెషల్ సాంగ్ కోసం ఎన్.టి.ఆర్ తో కలిసిన హంసా నందిని

NTR-and-Hamsa-Nandini
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో గ్లామరస్ బ్యూటీ హంసా నందిని ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. ఇది ఈ సినిమా కోసం షూట్ చేస్తున్న చివరి సాంగ్, ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఎన్.టి.ఆర్ – సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్టర్.

ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు, అలాగే భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు. ముందుగా ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version